మేడ్చల్ నియోజకవర్గం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో బీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, చామకూర మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, బూత్ కమిటీ సభ్యులకు నూతన డిజిటల్ సభ్యత్వ నమోదు మరియు ఓటర్ల జాబితా సవరణ అంశాలపై దిశా నిర్దేశం చేశారు. రాగిడి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు.