అల్వాల్ లోని పి.వి.ఎస్ ఫార్మసీ మెడికల్ స్టోర్ పై కేసు నమోదు

1037చూసినవారు
మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాలతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్న అల్వాల్ లోని పి. వి. ఎస్ ఫార్మసీ మెడికల్ స్టోర్ పై కేసు నమోదు చేశారు. అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. మెడికల్ స్టోర్ పై కేసు నమోదు చేసి పై అధికారులకు పంపించడం జరుగుతుందని, పై అధికారుల ఆదేశంతో తదుపరి చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు కూడా మెడిషన్స్ ఇవ్వకూడదని మెడికల్ షాపుల యజమానులకు ఇన్స్పెక్టర్ ప్రశాంత్ సూచించారు.

సంబంధిత పోస్ట్