శామీర్‌పేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీగా నిరసనలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పై వేధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.