కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: ఏనుగు సుదర్శన్ రెడ్డి

5చూసినవారు
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: ఏనుగు సుదర్శన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ జవహర్ నగర్ అధ్యక్షులు జోగారావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే జనగ్రహ సభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేశారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్