మేడ్చల్‌లో దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి సందర్భంగా మేడిపల్లి మండల కే వై సి ఎస్ అధ్యక్షులు మరాఠీ శివెందర్ కురుమ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కురుమ యువ చైతన్య సమితి రాష్ట గౌరవ అధ్యక్షులు గొరిగే నర్సింహా కురుమ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య కురుమ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని, వారి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు సత్యనారాయణ, సోమేశ్, విజయ్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.