జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భం
గా, హైదరాబాద్‌లోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ చౌదరిగూడలోని సురవి హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ ని డెమొక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ ప్రవీణ్ కి శాలువా కప్పి, మొక్క అందజేసి సన్మానించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్, బంగారి రాజయ్య, రాజా నర్సు, లక్ష్మీ నారాయణ, బీరయ్య, ప్రభాకర్, కొట్టే మల్లయ్య, మల్లేష్, రఫీక్, మల్లయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.