బౌరంపేటలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శంబిపూర్కు చెందిన వెంకటరెడ్డి మృతి చెందాడు. వెంకటరెడ్డి బైక్పై వెళ్తుండగా, ర్యాష్ డ్రైవింగ్తో వచ్చిన కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.