మాజీ సీఎంలు అసెంబ్లీకి రావాలి..రవి రాజ్ రాథోడ్

661చూసినవారు
మాజీ సీఎంలు అసెంబ్లీకి రావాలి..రవి రాజ్ రాథోడ్
హైదరాబాద్, మేడ్చల్ లో జనసేన నాయకుడు, న్యాయవాది రవి రాజ్ రాథోడ్ సోమవారం మాట్లాడుతూ ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు ప్రస్తుతం అసెంబ్లీకి హాజరుకాకుండా ప్రజలకు దూరంగా ఉండటం సరైన పద్ధతి కాదని అన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతామని చెప్పడం కంటే, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులుగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని, ప్రజా సమస్యలపై సభలో గళం వినిపించాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవద్దని రవి రాజ్ రాథోడ్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్