వక్రతుండ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నిమజ్జనం

5చూసినవారు
వక్రతుండ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నిమజ్జనం
భక్తుల కోలాహలాలు, డప్పు దరువుల మధ్య మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్‌లో గణపతి నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి. చెంగిచర్ల డివిజన్ పరిధిలోని చిన్నక్రాంతి కాలనీలో ‘వక్రతుండ బ్రదర్స్’ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుని నిమజ్జన మహోత్సవం సోమవారం కన్నులపండువగా, అంగరంగ వైభవంగా జరిగింది. నవరాత్రుల పాటు ధూపదీప నైవేద్యాలతో, రోజూ ప్రత్యేక పూజలందుకున్న లంబోదరుడు భక్తుల కోలాహలం మధ్య వీడ్కోలు తీసుకున్నాడు.

సంబంధిత పోస్ట్