మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఎదులాబాద్ గ్రామం వంజరువాడకు చెందిన ఆముద సంతోష్ (25) అనే యువకుడు మద్యానికి బానిసై, పనిలేక మనస్థాపంతో సోమవారం ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఆముద రోజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.