జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఆర్పీఎఫ్ అరుంధతి నగర్ లో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఆడుకుంటూ, దుర్గాప్రసాద్(11), సుబ్రహ్మణ్యం (8) అరుంధతి నగర్ బండ భావి దగ్గర ఉండే క్వారీ గుంతలోని నీటిలో పడి ప్రమాదవశాత్తు చనిపోయారు. నిన్న మధ్యాహ్నం నుండి పిల్లలు కనపడకపోవడంతో గురువారం ఉదయం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ అయినట్టు కంప్లైంట్ ఇచ్చిన పిల్లల తల్లిదండ్రులు. సాయంత్రం అరుంధతి నగర్ బండ బావి క్వారీలో పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.