జీవితం భారమని.. పిల్లలతో సహా తల్లి బలవన్మరణం.. సూసైడ్‌ నోట్‌

2చూసినవారు
జీవితం భారమని.. పిల్లలతో సహా తల్లి బలవన్మరణం.. సూసైడ్‌ నోట్‌
హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో నివాసముంటున్న ఐటీ ఉద్యోగిని విజయరెడ్డి (38), తన కుమార్తె చేతనరెడ్డి (18), కుమారుడు విశాల్‌రెడ్డి (17) లతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పిల్లలను హాస్టళ్ల నుంచి తీసుకువచ్చి, 12 గంటలకు చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రాత్రి 12.30 గంటలకు రైలు పట్టాలపైకి వెళ్లి, ఎదురుగా వస్తున్న గూడ్స్‌ రైలు ఢీకొని అక్కడికక్కడే మరణించారు. కారులో లభించిన సూసైడ్‌నోట్‌లో 'జీవితం భారంగా ఉంది, బతకాలని ప్రయత్నించినా బతకలేకపోతున్నా, పిల్లల్ని వదిలి వెళ్లలేక నాతో పాటు తీసుకెళ్తున్నా' అని రాసి ఉంది. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్