
విరాట్ కోహ్లీని పోలిన చిన్నారి.. షాక్ అయిన స్టార్ బ్యాటర్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ కోసం నెట్స్‌లో గట్టిగానే శ్రమించాడు. వడోదరలో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ నేపథ్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. సహచరులకు సూచనలిస్తూ సందడిగా గడిపాడు. ఈ సందర్భంగా తనలానే ఉన్న చిన్న పిల్లగాడిని చూసి కోహ్లీ షాకయ్యాడు. ఆ చిన్నారిని చూశాక తన చిన్నప్పటి ఫొటోలను గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత అతడికి నవ్వుతూ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా ఆడుతున్న కోహ్లీ న్యూజిలాండ్‌పై దంచేందుకు సిద్ధమయ్యాడు. నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించి అందర్నీ నవ్వించాడు.




