భారీ అగ్నిప్రమాదం.. పేలుతున్న కెమికల్ డ్రమ్ములు!

0చూసినవారు
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న డెకరేషన్ స్క్రాప్ గోదాంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గోదాంలో ప్లాస్టిక్ వస్తువులు, కెమికల్ సాల్వెంట్ డ్రమ్ములు ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. కెమికల్ డ్రమ్ములు పేలి రోడ్లపైకి ఎగిరిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని వాహనాలకు కూడా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్