మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మరాసిపేటలో నాగేశ్వరరావు ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి సుమారు 20 తులాల బంగారం, 2 లక్షల నగదును అపహరించుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇటీవల బంగారం ధరలు పెరగడంతో శామీర్ పేట పరిధిలో గొలుసు దొంగతనాలు, వరుస చోరీలు పెరిగి పోలీసులకు సవాల్‌గా మారాయి.