మేడ్చల్ నియోజకవర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి, పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మేడ్చల్ మండలంలోని బండ మైలారం నుండి కొంపల్లికి వెళ్తుండగా మేడ్చల్ ఐటిఐ వద్ద రాగానే ఓ ప్రైవేట్ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపాడు. బస్సులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.