మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

3చూసినవారు
మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆకుల అప్పల రాజు (54) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో నివాసం ఉంటున్న అప్పల రాజు, తన కుమారుడు గణేష్ (20)తో కలిసి బైక్‌పై మేడ్చల్ వైపు వెళ్తుండగా, పిస్తా హౌస్ హోటల్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అప్పల రాజు అక్కడికక్కడే మృతి చెందగా, గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు గణేష్‌ను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్