మేడ్చల్: చెల్లెలి ప్రైవేట్ ఫొటోలను అన్నకు పంపి బ్లాక్‌మెయిల్

14చూసినవారు
మేడ్చల్: చెల్లెలి ప్రైవేట్ ఫొటోలను అన్నకు పంపి బ్లాక్‌మెయిల్
హైదరాబాద్‌లో బీఫార్మసీ చదువుతున్న ఓ యువతి నగ్న ఫొటోలను అన్నకు పంపించి రూ.50 వేలు డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో పాటు చదువుకున్న యువకుడే ఈ పని చేశాడని బాధితురాలు సోదరులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం మేడ్చల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.