సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో మంగళవారం ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు పంతులు చెరువులో మునిగి మృతి చెందారు. మృతులు సాగర్ (17), అభిషేక్ (17)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.