మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువతి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గిర్మాపూర్కు చెందిన ముక్కెర కీర్తన (20) తన చిన్నాన్న ప్రభాకర్తో కలిసి బైక్పై వెళ్తుండగా, కండ్లకోయ వద్ద అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన అక్కడికక్కడే మృతి చెందగా, ప్రభాకర్, సంకీర్తన గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.