
దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది: ప్రధాని మోడీ
ప్రధాని మోదీ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'భారత్.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోంది. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పాల ఉత్పత్తిలో మనమే నంబర్ వన్. జనరిక్ మెడిసిన్ ఉత్పత్తిలోనూ మనమే నెంబర్ వన్. దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది' అని అన్నారు.




