కీసరలో నవజాత శిశువు మృతదేహం కలకలం

6చూసినవారు
కీసరలో నవజాత శిశువు మృతదేహం కలకలం
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం విజయపురి కాలనీలో నవజాత మగ శిశువు మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ధోబీఘాట్ వద్ద తెల్లటి కవర్‌లో శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్