మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

561చూసినవారు
మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అల్వాల్ బొల్లారం ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య (44), నరసింహులు ద్విచక్ర వాహనంపై బొల్లారం నుంచి బాబాగూడ వైపు వస్తున్నాడు. బాబాగుడా శివారు ప్రాంతంలో వాహనం అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బ్రహ్మయ్యకు చాతి భాగంలో తగలడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్