పేదలకు ఉచిత న్యాయ సేవలపై రవి రాజ్ రాథోడ్ అవగాహన

738చూసినవారు
పేదలకు ఉచిత న్యాయ సేవలపై రవి రాజ్ రాథోడ్ అవగాహన
మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ములాఖాత్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ వద్ద న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాది రవి రాజ్ రాథోడ్ పాల్గొని ఆర్థిక స్తోమత లేని పేద, నిరుపేద కుటుంబ సభ్యులకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. బెయిల్, అప్పీలు, ఉచిత న్యాయవాది సేవలు, న్యాయపరమైన హక్కులపై వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రజలు తమ న్యాయ హక్కులపై అవగాహన పొందడంతో పాటు, అవసరమైన సమయంలో డబ్బు లేకపోవడం వల్ల ఎవరికీ న్యాయం దూరం కాకూడదని, అవసరమైన వారు ప్రభుత్వ ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్