చంపాపేట కార్పొరేటర్ దివంగత వంగా మధుసూదన్ రెడ్డి పేరుతో సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ నామకరణ చేయాలని GHMC కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి GHMC కమిషనర్ కర్ణన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కమిషనర్ సానుకూలంగా స్పందించి, త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మేయర్‌ను కూడా ఈ విషయంలో కోరారు.