మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్‌లోని పూర్ణిమా స్కూల్‌లో నర్సరీ చదువుతున్న చిన్నారిని స్కూల్ ఆయా దారుణంగా కొట్టింది. ఆయా కొట్టడంతో భయాందోళన చెందిన చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో తల్లిదండ్రులు రామ్ హాస్పిటల్‌కు తరలించారు. పాపను ఆయా కొట్టిన వీడియోను పోలీసులకు చూపించి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఆయాను అదుపులోకి తీసుకున్నారు.