నాగోల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

113చూసినవారు
నాగోల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి
సోమవారం నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ఇంటర్ విద్యార్థి మృతి చెందగా, మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొత్తపేటలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు బైక్‌పై వెళ్తుండగా, ఫతుల్లగూడ 100 ఫీట్ల రోడ్డులో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న విష్ణువర్ధన్ (17) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఉషా కిరణ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ వెల్లడించారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు రోడ్లపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్