బోడుప్పల్లో ఘనంగా శ్రీవాసవిమాత జయంతి ఉత్సవాలు...

3చూసినవారు
బోడుప్పల్లో ఘనంగా శ్రీవాసవిమాత జయంతి ఉత్సవాలు...
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో శ్రీ కన్యకా పరమేశ్వరి, శివాలయ నిర్మాణ కమిటీ బోడుప్పల్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ వాసవి మాత ఆశీస్సులతో ప్రజలంతా క్షేమంగా ఉండాలని, త్వరలో ఆలయ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీస వెంకటేష్ గౌడ్, భుఖ్య సుమన్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you