జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా, మేడ్చల్ జిహెచ్ఎంసి పరిధిలోని మల్లారెడ్డి కాలేజీకి చెందిన ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులతో మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్, మేడ్చల్ సీఐ సత్యనారాయణ పాల్గొన్నారు. విద్యార్థులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, సీట్ బెల్ట్ వినియోగించాలి అని ప్లకార్డుల ద్వారా తెలియజేశారు.