జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా, మేడ్చల్ GHMC పరిధిలోని మల్లారెడ్డి కాలేజీకి చెందిన NSS, NCC విద్యార్థులు మేడ్చల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు హెల్మెట్ తప్పనిసరి, సీట్ బెల్ట్ వాడకం, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వేగ నియంత్రణ పాటించాలని సూచిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మేడ్చల్ ట్రాఫిక్ సీఐ మధుసూదన్, మేడ్చల్ సీఐ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.