హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో తండ్రి, తల్లి, కుమార్తె ఉన్నట్లు సమాచారం. వీరిని బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన పి.సురేందర్‌రెడ్డి, విజయ, చేతనరెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.