మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భగత్ సింగ్ జయంతి సందర్భంగా
జనసేన నాయకుడు రవి రాజ్ రాథోడ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రవి రాజ్ రాథోడ్ మాట్లాడుతూ భగత్ సింగ్ ధైర్యం, దేశభక్తి, త్యాగం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, దేశం, సమాజం కోసం ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుతున్న కొత్తతరం రాజకీయాల్లో యువత చురుకుగా భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, మహేష్ రెడ్డి, సుమలత తదితరులు పాల్గొన్నారు.