తహశీల్దార్ వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 11వ తేదీన సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఒక మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ వంటి వివిధ రంగాలకు చెందిన 162 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. ఉద్యోగార్థులు <> అనే వెబ్‌లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు.