నెల 27వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ పిలుపునిచ్చారు. సోమవారం బీఆర్ఎస్ గాంధీనగర్ డివిజన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గాంధీనగర్ డివిజన్లోని ప్రతి బస్తీ, గల్లీ నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సభకు తరలి రావాలని అన్నారు.