హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, విద్యుత్, పార్కులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజలకు మెరుగైన జీవన సౌకర్యాలు అందిస్తామని ఆయన చెప్పారు.