గద్దర్ 78వ జయంతి: మంత్రి లక్ష్మణ్ కుమార్ నివాళులు

83చూసినవారు
గద్దర్ 78వ జయంతి: మంత్రి లక్ష్మణ్ కుమార్ నివాళులు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, గద్దార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ 78వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల మనోభావాలను గేయ రూపంలో తీసుకెళ్లి, తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు కృషి చేసిన గద్దర్ సేవలు మరువలేనివని తెలిపారు. గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్