గాంధీనగర్లోని పీజీ మహిళ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం

1చూసినవారు
గురువారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఉన్న సుధామ పీజీ మహిళా హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, హైడ్రా సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్