ఆస్తమాకు సరైన శాస్త్రీయ వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలీ..

0చూసినవారు
ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నారాయణగూడలో శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్వాస హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వీరపనేని విష్ణున్ రావు మాట్లాడుతూ, ఆస్తమాకు సరైన శాస్త్రీయ వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. గత 30 ఏళ్లుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన గాలి పీల్చుకునే హక్కు ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాలిలోకి బెలూన్లు ఎగురవేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్