అశోక్‌నగర్‌లో విద్యుత్ తీగ తెగిపడింది.. ట్రాఫిక్ మళ్లింపు

0చూసినవారు
అశోక్‌నగర్‌లో విద్యుత్ తీగ తెగిపడింది.. ట్రాఫిక్ మళ్లింపు
శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జంక్షన్ సమీపంలోని అశోక్‌నగర్ వద్ద ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఎల్‌టీ (లో టెన్షన్) విద్యుత్ తీగ రోడ్డుపై తెగిపడింది. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించి, ప్రజల భద్రత కోసం ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. వాహనదారులు సహకరించాలని అధికారులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్