సికింద్రాబాద్: నిరాశ్రయులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కలెక్టర్ కు వినతి

83చూసినవారు
సికింద్రాబాద్: నిరాశ్రయులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కలెక్టర్ కు వినతి
బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ వినయ్ కుమార్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని శుక్రవారం కలిశారు. గాంధీ నగర్ డివిజన్లోని వివేకానంద నగర్ బస్తీ వాసుల ఇళ్లను గతేడాది కూల్చి వేశారు. ఏడాదిన్నర కావొస్తున్న ఇంతవరకు బాధితులకు ఇళ్లు కేటాయించలేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నిరాశ్రయులైన 19 మంది నిరుపేద దళిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని కోరారు.