రూ 85 లక్షలతో బోలక్పూర్ లో రోడ్ల ఆధునీకరణ: ఎమ్మెల్యే

56చూసినవారు
రూ 85 లక్షలతో బోలక్పూర్ లో రోడ్ల ఆధునీకరణ: ఎమ్మెల్యే
ముషీరాబాద్ భోలక్పూర్ లో దశాబ్దాల క్రితం వేసిన రోడ్లు అధ్వానంగా మారడంతో వాటిని ఆధునికరించేందుకు రూ 85 లక్షలతో సీసీ రోడ్లు వేశామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. భోలక్పూర్ డివిజన్లోని బంగ్లాదేశ్ మార్కెట్, సిద్ధిక్ నగర్ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి డిఈ సన్నీతో కలిసి శనివారం ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ నగరంలో చార్మినార్ ను తలపించే విధంగా బంగ్లాదేశ్ మార్కెట్లో వస్త్ర వ్యాపారం కొనసాగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్