తమిళనాడు కొత్త ముఖ్య కార్యదర్శిగా (CS) సాయికుమార్ నియమితులయ్యారు. TGకి చెందిన ఈ 1990 బ్యాచ్ IAS అధికారి, ఎన్నికల నేపథ్యంలో మురుగానందం స్థానంలో EC ఆదేశాల మేరకు ఈ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, విద్యుత్ మండలి ఛైర్మన్, సీఎం ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సాయికుమార్, 2022 నుంచి TN న్యూస్ ప్రింట్, పేపర్స్ Ltd ఛైర్మన్ గా ఉన్నారు. హైదరాబాద్ లో చదువుకున్న ఆయన, పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్, పబ్లిక్ అఫైర్స్ లో PhD చేశారు.