నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ‘సమ్మర్ ఉత్సవ్ మేళా’

674చూసినవారు
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ‘సమ్మర్ ఉత్సవ్ మేళా బుధవారం ’ సందడిగా ప్రారంభమైంది. సినీ నటుడు అలీ సతీమణి జుబేదా ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఫిలిప్పీన్స్ మహిళలు ప్రదర్శిస్తున్న ‘జలకన్యల లైవ్ షో’తో పాటు ఐఫిల్ టవర్, మ్యూజికల్ ప్యాలెస్ సెట్టింగ్‌లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మేళా ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్