తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (TDCA) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, HCA రూ. 68. 73 కోట్ల నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించిన నిధులను వెనక్కి తీసుకుని గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి వినియోగించాలని ఆయన కోరారు. మంగళవారం జింఖానా గ్రౌండ్‌లో హెచ్‌సీఏ అధ్యక్షుడి సమావేశం జరుగుతున్న సమయంలో అల్లీపురం ఆధ్వర్యంలో టీడీసీఏ శ్రేణులు మెరుపు ధర్నా చేపట్టాయి.