హైదరాబాద్: విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలి

62చూసినవారు
హైదరాబాద్: విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలి
పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ లో ఆర్టీసీ ఎండి సజ్జనర్ కి ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం మంగళవారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగర కార్యదర్శి పృథ్వితేజ మాట్లాడుతూ ప్రజారవాణాలో ప్రయాణిస్తూ చదువుకునే విద్యార్థుల బస్ పాస్ చార్జీలు పెంచడాన్ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చార్జీలను పెంచాలని చూడటం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్