లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ సమీపంలో సైఫాబాద్ పోలీసులు శనివారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. లక్షల విలువైన 21.251 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖపట్నానికి చెందిన శ్రీను అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి ముంబైకి తరలిస్తుండగా నిఘా ఉంచిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు.