ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల కోసం ABVP ఆందోళన

386చూసినవారు
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ABVP కార్యకర్తలు మంగళవారం మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్