కోఠి కాల్పుల ఘటనలో వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్

7చూసినవారు
హైదరాబాద్‌లోని కోఠి SBI ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. ఉదయం 7 గంటలకు డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిషద్ అనే వ్యక్తిని ఫాలో అయ్యి గన్‌తో కాల్పులు జరిపారు. అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదుతో పరారయ్యారు. ఘటనలో రషీద్ కాలికి బులెట్ గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన సీసీఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్