మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న సెంట్రల్ మెడికల్ స్టోర్‌లో గురువారం ఉదయం 11:32 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. నిలోఫర్ ఔట్‌పోస్ట్ ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఏడీఎఫ్‌ఓ వజ్జె భాను ప్రతాప్ పర్యవేక్షణలో ఈ కార్యకలాపాలు జరిగాయి.