గాంధీ భవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం,
కేటీఆర్, హరీశ్‌రావులపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక కుటుంబం వల్ల కాదని, నాలుగు కోట్ల మంది ప్రజల పోరాటం,
విద్యార్థులు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో
కాంగ్రెస్, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల పాత్ర కీలకమని పేర్కొన్నారు.